జమ్మలమడుగు: చెన్నూరు : పట్టణంలోని బిజెపి కార్యాలయంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్బంగా నాయకుల నివాళులు
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని చెన్నూరు మండలం చెన్నూరు భారతీయ జనతా పార్టీ చెన్నూరు కార్యాలయంలో గురువారం శ్రీ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. చెన్నూరు. మండల అధ్యక్షులు శ్రీ పెడబల్లె వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శివాలపల్లె సుబ్బయ్య, ముకుంద రెడ్డి, రమేష్ రెడ్డి, శ్రీనివాసరాజు, ఆదిమూల వెంకటసుబ్బయ్య, తదితరులు పాల్గొని ఆయన చేసిన సేవలను కొనియాడారు.