రాయదుర్గం: మురడి గ్రామంలో జరిగిన హత్య పై దర్యాప్తు చేపట్టిన సిఐ వెంకటరమణ
డి.హిరేహాల్ మండలంలోని మురడి గ్రామంలో సోమవారం ఉదయం జరిగిన హత్య సంఘటన స్థలాన్ని సీఐ వెంకటరమణ, ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి పరిశీలించారు. కుటుంబ సభ్యులను విచారించారు. వ్యసనాలు, తాగుడుకు అలవాటుపడిన హనుమంతరాయుడు బార్య నాగరత్నమ్మను అనుమానంగా చూసేవాడన్నారు. డబ్బు కోసం బార్యను వేధిస్తుండేవాడని, తాగేందుకు డబ్బు ఇవ్వనందుకే బార్యను సోమవారం తెల్లవారుజాము దారుణంగా గొడ్డలితో దారుణంగా నరికి చంపేశాడని ప్రాథమికంగా నిర్దారణకు వచ్చినట్టు సిఐ తెలిపారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించామన్నారు.