ప్రకాశం జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో మంగళవారం ముమ్మారంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా వాహనాలను తనిఖీ చేయడంతో పాటు అనుమానిత వ్యక్తులను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. మత్తు పదార్థాలు మాదకద్రవ్యాలు, పేలుడు పదార్థాలు వంటివి తరలింపు అడ్డుకునేందుకు వాహనాలను తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఎస్పీ ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.