తాడేపల్లిగూడెం: రాయితో తలపై కొట్టి, మెడ కోసి హత్య, పట్టణంలో రేలింగి చిత్ర మందిరం వద్ద దారుణ ఘటన
తాడేపల్లిగూడెం పాత రేలంగి చిత్ర మందిర్ వద్ద ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు మద్యం మత్తులో తలపై రాయితో కొట్టి, మెడపై కోసి ఒక వ్యక్తిని హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. ఘటనలో రెడ్డి గోవిందు (50) మృతి చెందాడు. మద్యం మత్తులో కుక్కల మల్లేశ్వరరావు (మల్లి) ఈ దారుణానికి పాల్పడ్డాడు. మృతుడు గోవిందు గడ్డి కోస్తూ జీవనం సాగిస్తున్నాడు. మృతునికి భార్య కుమారి, ఇరువురు కుమార్తెలు కలరు. పెద్ద కుమార్తె వరలక్ష్మి మీడియాతో మాట్లాడారు.