భువనగిరి: భూధాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో ఉరేసుకుని మహిళా ఆత్మహత్య
యాదాద్రి భువనగిరి జిల్లా భూధాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలో ఉరివేసుకొని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది .మంగళవారం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణ కేంద్రానికి చెందిన రామసాని అక్షయ(35), కొంగర్ కలాన్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో నైట్ షిఫ్ట్ లో పనిచేసుకుంటూ జీవనం కొనసాగించేది.భర్త బజారుకు వెళ్లి వచ్చి చూసేసరికి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు చున్నితో ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించని హుటాహుటిన అక్షయను కిందికి దింపి చూసేసరికి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చౌటుప్పల్ రూరల్ సీఐ రాములు,ఎస్సై భాస్కర్ రెడ్డి పరిశీలించారు.