కోడుమూరు: అంగన్వాడి వర్కర్స్ సమస్యలపై కోడుమూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా
అంగనవాడి వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సోమవారం కోడుమూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి గఫూర్ మియా మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు చాలీచాలని జీతంతో కుటుంబాలను పోషించలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పలు రకాల మొబైల్ యాప్ లతో పని చేయిస్తూ వేధిస్తున్నారని విమర్శించారు. అంగన్వాడి కార్యకర్తల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో పోరాటాలు సాగిస్తామని హెచ్చరించారు.