కలికిరి మండలం కలికిరి పట్టణంలోని ప్రభుత్వ హైస్కూల్ హెచ్ఎం వి.జి నటరాజన్ ఆధ్వర్యంలో ఒకేషనల్ ఉపాధ్యాయుడు సునీల్ మరియు 9,10 వ తరగతి విద్యార్థులు కలిసి ట్రేడ్ ,రిటైల్ గురించి, వ్యాపారాలు, లావాదేవీలు, సూపర్ మార్కెట్ గురించి మరియు జీఎస్టీ గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.అదే విధంగా కలికిరి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో జిల్లా పరిషత్ ఉన్నత ఆవరణలో కార్తీక వనమహోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. కాలుష్య నియంత్రణకు పర్యావరణ పరిరక్షణ పై అవగాహన ఎంతో అవసరమని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లోను, పాఠశాలల్లోను మొక్కలు నాటాలన్నారు