శ్రీకాకుళం: పొలంలో విద్యుత్ మోటార్ వేస్తుండగా విద్యుత్ షాక్ కు గురై మృతి పాలవలసకు చెందిన రైతు పీతాంబరం ఈశ్వరరావు
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పాలవలస గ్రామానికి చెందిన రైతు పితాంబరం ఈశ్వరరావు(45) బుధవారం సాయంత్రం గ్రామ సమీపంలో ఉన్న తన పొలంలో ఉన్న విద్యుత్ మోటార్ వేస్తుండగా.... విద్యుత్ షాక్ కు గురై మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. సమీప పొలాల్లో ఉన్న రైతులు గమనించి 108 అంబులెన్స్ లో బారువ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఘటనపై బారువా ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.