దర్శి: దర్శి సాగర్ కాలువలో గల్లంతైన యువకుడు అమిర్ భాష మృతదేహం లభ్యం
Darsi, Prakasam | Nov 10, 2025 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని పొదిలి రోడ్డులో నివాసం ఉంటున్న వెల్డింగ్ వర్కర్ యువకుడు అమిర్ భాష కురిచేడు రోడ్డు లోని సాగర్ కాలువ నీటి ప్రవాహంలో ఆదివారం గల్లంతయ్యారు. అనంతరం కాలవలో ఎంత వెతికినా ఫలితం లేదు. సోమవారం పొదిలి రోడ్డు లోని పవర్ ప్రాజెక్టు వద్ద నీటిపై తేలాడుతూ మృతదేహం లభ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.