అమలాపురంలో కలెక్టరేట్ వద్ద పీజీఆర్ఎస్ కు వచ్చిన వృద్ధుడికి అస్వస్థత
అమలాపురంలో పీజీఆర్ఎస్ కు వచ్చిన ఓ వృద్ధుడు ఊపిరాడక అస్వస్థతకు గురయ్యా రు. వెంటనే అప్రమత్తమైన అధికారులు అతడిని అంబులెన్స్ ఆసుపత్రికి తరలించారు. ఆ వృద్ధుడిని కాట్రేనికోన మండలం రావూరిపేటకు చెందిన జగడం భీముడుగా గుర్తించారు. కొంత కాలంగా ఆయన పెన్షన్ కోసం కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.