కడప జిల్లా ప్రొద్దుటూరు రూరల్ సర్కిల్ సీఐ నాగభూషణ్ ఆదివారం మట్కా ఆడే వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. రూరల్ సర్కిల్ సిఐ నాగభూషణ్ ఆధ్వర్యంలో ప్రొద్దుటూర్ రూరల్ ఎస్సై అరుణ్ రెడ్డి మట్కా పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపధ్యంలో రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో టి షాప్ ముసుగులో మట్కా నిర్వహిస్తున్న వ్యక్తి ని అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి 8,250/- రూపాయలు డబ్బులు,మట్కా స్లిప్పులు మరియు అతని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే అతని వద్ద మట్కా ఆడిన వారిని గుర్తించి,వారిని కూడా స్టేషన్కు పిలిపించి వారికి సీఐ నాగభూషణ్ కౌన్సిలింగ్ ఇచ్చారు.