అసిఫాబాద్: తిర్యాణి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులే వంట మాస్టర్లు
తరగతి గదిలో కూర్చుని విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన టీచర్ విద్యార్థుల తమ ఆకలి తీర్చడానికి వంట మాస్టర్లు గా మారారు. జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖలోని ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న డెయిలీ వేజ్ వర్కర్లు టైం స్కేల్ చేయాలని. జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ గత మూడు రోజులుగా జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్న నేపథ్యంలో విద్యార్థులతో కలిసి టిచర్ వంటలు చేసుకుంటున్నారు. సోమవారం తిర్యాణీ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పలు విద్యార్థులు కలిసి టిచర్ వంట చేస్తూ కనిపించింది.