మార్కాపురం: స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
ప్రకాశం జిల్లా మార్కాపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ నారాయణ రావు అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. వాతావరణ కాలుష్యం తగ్గించాలని సైకిల్ తొక్కి అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రోడ్లను ఉడ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... వైసిపి దొంగ సంతకాలను ఎవరు నమ్మవద్దన్నారు. అభివృద్ధిని అడ్డుకునేందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.