వర్ని: శ్రీనగర్ వద్ద రోడ్డు ప్రమాదం; ఇద్దరికీ తీవ్ర గాయాలు; ఆసుపత్రికి తరలింపు
వర్ని మండలంలోని శ్రీనగర్ వాగు వద్ద గురువారం సాయంత్రం 4 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. శ్రీనగర్ గ్రామానికి చెందిన వాగ్మోరే సుభాష్ (25) సిందిగిడి ఉమాకాంత్ (24 )వర్ని నుండి శ్రీనగర్ వెళ్తుండగా నిజామాబాద్ నుండి వర్ని వైపు వస్తున్న కారు ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని నిజామాబాద్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వర్ని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.