జమ్మలమడుగు: బద్వేలు :పరిధిలోని పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్
కడప జిల్లా బద్వేలు పెద్ద చెరువును ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పరిశీలించారు.పెద్ద చెరువు పూర్తిగా నిండిన నేపథ్యంలో తగు జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా ఆయన అధికారులకు సూచించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని డ్రైనేజీ కాలువలను పరిశీలించి విస్తరణ చేయుట కొరకు ఎస్టిమేట్ మరియు డిజైన్ డ్రాయింగ్ సిద్ధం చేయమని ఆర్డిఓ చంద్రమోహన్, మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి లకు సూచించారు.ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.