టంగుటూరు మండలంలో బుధవారం ఎస్సై నాగమల్లేశ్వరరావు ద్విచక్ర వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న ప్రతి వ్యక్తి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఇటీవల వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన వారి వివరాలను తెలుపుతూ హెల్మెట్ లేకపోవడం వల్ల వారు చనిపోవడం జరిగిందని ఇటువంటి సంఘటనాలను చూసి అయినా వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. మీ వాహనంపై వెనక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలా చూసుకోవాలన్నారు.