పాణ్యం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీని వీడి YSR CP పార్టీలో కి చేరిన ఐదు కుటుంబాలు
Panyam, Nandyal | Nov 12, 2025 పాణ్యం మండలం ఎస్.కొత్తూరు గ్రామానికి చెందిన ఐదు తెలుగుదేశం పార్టీ కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సమక్షంలో ఆవుల రామ బంగారయ్య, సురేష్, నాగేశ్వరరావు, రాజు, కుమ్మరి వెంకటేశ్వర్లు కుటుంబాలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు.