రాయదుర్గం: తప్పులులేని ఓటరు జాబితా రూపొందించండి : నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ రవిశంకర్ రెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వార్డుల వారిగా తప్పులేని ఓటరు జాబితా రూపొందించాలని రాయదుర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవిశంకర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం ఉదయం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నాగరాజు, మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డితో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, విఆర్ఓలు, బిఎల్ఓ లతో సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు పక్కాగా ఉండాలన్నారు. ఎవరి వత్తిడి లేకుండా పారదర్శకంగా ఓటరు జాబితా ఉండేలా చూడాలని సూచించారు.బిఎల్ఓలు క్షేత్రస్థాయి పరిశీలన చేసి 1200 ఓటర్లు దాటిన పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ చేయాలన్నారు.