సిర్పూర్ టి: హుడికిలి వద్ద పెనుగంగ ఉధృతికి పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు, నీట మునిగిన పంట పొలాలు
సిర్పూర్ టి మండలం హుడికిలి వద్ద పెనుగంగ ఉధృతికి పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పెనుగంగా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పంట పొలాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. పంటలు నీట మునిగిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సర్వే నిర్వహించి నష్ట పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. శనివారం నుండి భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు,