అడ్డాకుల: అడ్డాకుల మండలం కందూరు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన ఎంపీ డీకే అరుణ
దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలం కందూరు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో రూ. 7 లక్షలు ఎంపీ నిధులతో నిర్మించిన వసతి గృహాలను శుక్రవారం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని ఎంపీ నిధులతో అధునాతన హంగులతో కమ్యూనిటీ హాల్ ను నిర్మించడం జరిగిందన్నారు. ఇదే తరహా మోడల్ కమ్యూనిటీ హాల్స్ త్వరలో పార్లమెంటు అంతటా దశల వారీగా నిర్మిస్తామన్నారు.