అవుకులో గత నాలుగు రోజుల నుండి త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
అవుకు మండల పరిధిలో తాగునీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవుకులోని మండపం వీధి, ఎస్సీ కాలనీ, అంబేద్కర్ కాలనీలలో నాలుగు రోజుల నుంచి మంచి నీరు అందక ప్రజలు విలవిల్లాడుతున్నారు. అటు పంచాయతీ అధికారులు నీటి సమస్య పరిష్కరించడానికి ట్యాంకర్ల సహాయంతో నీటిని తరలించినా ప్రయోజన రహితంగా ఉందంటున్నారు. త్వరగా తాగునీటి సమస్యను పరిష్కరించి నీటిని అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు.