కృష్ణాపురం ప్రాథమిక పాఠశాల మలుపులో హైవేపై గుంతలు పూడ్చిన నాగలాపురం ఎస్సై సునీల్
హైవేపై గుంతలు పూడ్పించిన నాగలాపురం ఎస్సె నాగలాపురం మండలం కృష్ణాపురం ప్రాథమిక పాఠశాల మలుపులో చెన్నై హైవేపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. విషయం తెలుసుకున్న నాగలాపురం ఎస్ఐ సునీల్ కంకరను పరచి మట్టితో హైవేపై ఉన్న గుంతలను పూడ్పించారు. రోడ్డు పక్కన నిల్వ ఉన్న మురుగు నీటిని రోడ్డు పక్కకు వెళ్లే విధంగా శుభ్రపరచారు. గుంతలు పూడ్చడంతో వాహన చోదకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.