కదిరిలో యుటిఎఫ్ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల పరిష్కారం పై బైక్ ర్యాలీ
శ్రీ సత్య సాయి జిల్లా కదిలి పట్టణంలో యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఆర్థిక విద్యారంగ సమస్యలపై వాటిని పరిష్కరించాలని కోరుతూ బుధవారం బైక్ ర్యాలీను నిర్వహించారు. ఈనెల 25వ తేదీన విజయవాడలో రణభేరి బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు, జయప్రదం చేయాలని కోరారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై, అలాగే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని, డిఏలు, బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.