పలమనేరు: పట్టణంలో SDPI పార్టీ అసెంబ్లీ అధ్యక్షుడు ముబారక్ మరియు కార్యవర్గ సభ్యులు ఆధ్వర్యంలో కేరళ రాష్ట్రం నందు స్థానిక ఎన్నికలలో SDPI పార్టీ 102 స్థానాలలో ఘన విజయం సాధించిందిన సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయం నందు పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేశారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) పార్టీ కేరళ రాష్ట్రం లో ఎలాంటి కూటమి లేకుండా స్వతంత్రంగా పోటీ చేసి 102 స్థానాలు గెలుచుకోవడం ద్వారా ఒక చారిత్రాత్మక రాజకీయ మైలురాయిని సాధించింది. ఈ ఘన విజయం పార్టీ యొక్క బలమైన సంస్థాగత సామర్థ్యం, ప్రజల కేంద్రంగా సాగించిన ఉద్యమాలు గుర్తుకు తెస్తాయన్నారు.