కళ్యాణదుర్గం: చిన్నంపల్లి గ్రామ శివారులోని నీటి కుంటలో పడి తరుణ్ (16) బాలుడు మృతి
సెట్టూరు మండలం చిన్నంపల్లి గ్రామ శివారులోని నీటి కుంటలో పడి సోమవారం తరుణ్ (16) అనే బాలుడు మృతి చెందాడు. సెట్టూరు కు చెందిన రాజన్న కుమారుడు తరుణ్ చిన్నంపల్లిలోని తన పెదనాయన ఇంటికి వెళ్ళాడు. అయితే చిన్నంపల్లి గ్రామ శివారులో ఉన్న నీటి కుంటలో కాళ్లు, చేతులు శుభ్రం చేసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. దీంతో ఊపిరాడక మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.