సూళ్లూరుపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నాగుల చవితి వేడుకలు
- శ్రీ చెంగాలమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా శనివారం నాగుల చవితి వేడుకలను భక్తులు నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని నాయుడుపేట పెళ్ళకూరు ఓజిలి దొరవారిసత్రం తడ మండలాల్లో ఘనంగా నాగుల చవితి వేడుకలు జరిగాయి. భక్తులతో ఆలయాలు కిటకిట వాడాయి. ఈ క్రమంలోనే సూళ్లూరుపేట పట్టణ వాసులు నాగులచవితి పండుగను ఘనంగా జరుపుకున్నారు. శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో ఉన్న నాగులపుట్ట వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు తెల్లవారుజాము నుండి పూజలు ప్రారంభించారు. పుట్ట వద్ద ఉన్న నాగేంద్రుని శిలలకు భక్తులు పాలుతో అభిషేకాలు చేశారు. అనంతరం పుట్ట వద్ద ఇటుకలను పెట్టి పసుపు కుంకుమ పూసి, పిండి దీపాలు వెలిగించి