నియోజకవర్గంలో భారీ వర్షం, చెరువులను తలపిస్తున్న రోడ్లు
శ్రీకాళహస్తిలో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు శ్రీకాళహస్తిలో మంగళవారం భారీ వర్షం కురిసింది. అల్పపీడన ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడడం మొదలయ్యాయి. ఆపై గంటపాటు గ్యాప్ లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని పలు వీధుల్లో జలమయమవడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షపు నీటితో పట్టణంలోని పలు వీధులు జలమయమయ్యాయి. నగరివీధి, గాంధీవీధి, జయరాం రావువీధి, సంత మైదానం, మరాఠీపాళెం, ప్రభుత్వాస్పత్రి రోడ్లు వర్షం నీటితో నిండిపోయాయి.