ఆందోల్: అందాల పోటీల నిర్వాహనకు ఉన్న నిధులు విద్యార్థుల ఫీజు బకాయలు ఇవ్వడానికి నిధులు లేవా ఏఐఎస్ఎఫ్ డిమాండ్.
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని జోగిపేట పట్టణంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి దత్తు రెడ్డి మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల్లో జీవితాలతో ప్రభుత్వం చెలగాటమారడం సరికాదన్నారు. అందాల పోటీలకు ఉన్న నిధులు విద్యార్థుల బకాయిలు చెల్లించడానికి లేవా అని ప్రశ్నించారు. వెంటనే పెండింగ్లో ఉన్న పదివేల కోట్ల బకాయిలు చేయాలని లేనిచో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు అశోక్,ఇసాక్ తదితరులు పాల్గొన్నారు.