నల్గొండ: జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగిన అడవిదేవులపల్లి ముంపు గ్రామాల గిరిజన రైతులు, పట్టాలు ఇవ్వాలని డిమాండ్
నల్గొండ జిల్లా, అడవిదేవులపల్లి మండలంకి చెందిన ముంపు గ్రామాల గిరిజనులకు కేటాయించిన భూములకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు గిరిజన రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వం పునరావాసంలో భాగంగా ముంపు గ్రామాల గిరిజనులకు భూములు కేటాయించినప్పటికీ, వాటికి పట్టాలు ఇవ్వడంలో జాప్యం చేస్తుందని ఆరోపించారు. దీనివల్ల ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలు పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుండి తమ గోడును విన్నవించుకునేందుకు చూస్తున్న కలెక్టర్ పట్టించుకోవడంలేదని వాపోయారు.