అలంపూర్: ఐజలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి గాయాలు
ఐజ మండలం బింగిదొడ్డి శివారులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. కారు, బైకు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన సత్యన్నను చికిత్స నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.