పెండింగ్లో ఉన్న 8,300 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంపై ఏబీవీపీ విద్యార్థులు కూకట్పల్లి జేఎన్టీయూలో నిరసనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని విమర్శిస్తూ విద్యార్థులు ప్రధాన గేటు వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని నేతలు హెచ్చరించారు.