నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీ నగర్ కు చెందిన మల్హోత్రా నర్మదా తన కుమార్తె అదృశ్యంపై ఫిర్యాదు చేశారు. వారి చిన్న కుమార్తె లక్ష్మీ ప్రసన్న మహోత్సవ అక్టోబర్ 13 మధ్యాహ్నం సుమారు ఒంటిగంటకు ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లి, ఇప్పటివరకు తిరిగి రాలేదు. ఆమె కోసం కుటుంబ సభ్యులు గాలించిన ఫలితం లేకపోవడంతో తల్లి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.