ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రం నుంచి తమ గ్రామాలకు వెళ్లే పాఠశాలల విద్యార్థులు ప్రమాదకరమైన పరిస్థితులలో బస్సులో ప్రయాణిస్తున్నారు. గురువారం సాయంత్రం రాచర్ల మండలం నుంచి అన్నం పల్లె, తురిమెళ్ళ వైపు వెళ్లే బస్సు ఎక్కిన విద్యార్థులు బస్సు కాళీ లేక డోర్ వద్ద వేలాడుతూ కనిపించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు తగినన్ని బస్సుల సదుపాయం కల్పించి విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని కోరుతున్నారు.