పాణ్యం: ఓర్వకల్ మండలం మాదన్నకుంటకు నీరు చేరేలా చర్యలు తీసుకోండి : ప్రజా సంఘాలు డిమాండ్
ఓర్వకల్లు మండలంలోని బ్రాహ్మణపల్లి చిన్న మాదన్నకుంటకు నీటి ప్రవాహాన్ని ఏపీఐఐసీ, రిలయన్స్ అడ్డుకుంటోందని సిపిఐ, రైతుసంఘం, విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. మంగళవారం గ్రామంలో పర్యటించిన వారు మాట్లాడుతూ కుంట ఆధారంగా 50 ఎకరాల్లో పంటలు సాగుతుండగా, నీరు లేక పశువులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాలువలు మళ్లించి నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.