ఎన్నికల్లో పిఓ, ఏపీఓల పాత్ర కీలకమైనది పిడి పి.సుధాకర్
ఎన్నికల్లో పిఓ, ఏపీఓల పాత్ర చాలా బాధ్యతతో కూడుకున్నదని మెప్మా పీడీ పీ.సుధాకర్ అన్నారు. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు రాజాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నియోజకవర్గ పరిధిలో రాజాం, రేగిడి,వంగర సంతకవిటి మండలాల్లోని పిఓ, ఎపిఓల శిక్షణ శిబిరాల్లో ఆయన పాల్గొన్నారు. పిఓ, ఎపిఓల విధులపై దిశ నిర్దేశం చేశారు. సమావేశంలో రిటర్నింగ్ అధికారి ఎల్.జోసఫ్, తాహసిల్దార్ ఎస్.కృష్ణంరాజు, ఎన్నికల డిటి ప్రకాష్ రాజు పాల్గొన్నారు.