భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో చాకలి ఐలమ్మ చిత్రపటానికి కలెక్టర్ ఘన నివాళులు
యాదాద్రి భువనగిరి జిల్లా: వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా భువనగిరి జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం ఆమె చిత్రపటానికి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఐలమ్మ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహోన్నత వ్యక్తి అని కలెక్టర్ కొనియాడారు .ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అధినేత కలెక్టర్ భాస్కరరావు ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొని ఐలమ్మ సేవలను స్మరించుకున్నారు.