ఆదోని: పెద్ద తుంబలం నూతన ఎస్సై ను కలిసిన దొడ్డన గేరి గ్రామస్తులు
Adoni, Kurnool | Nov 3, 2025 పెద్ద తుంబలం నూతన ఎస్ఐగా మల్లికార్జున బాధ్యతలు స్వీకరించారు. సోమవారం దొడ్డనగిరి గ్రామానికి చెందిన సర్పంచ్ మరియు టిడిపి నాయకుల ఆధ్వర్యంలో పెద్ద తుంబలం ఎస్సైను మర్యాదపూర్వకంగా పోలీస్ స్టేషన్లో కలిశారు. వారికి పూలమాలవేసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటానని, ఎస్సై మల్లికార్జున తెలిపారు.