అమరవీరుల మార్కస్త్వాన్ని నిర్మించేందుకు స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేసిన మాజీ సైనికులు
Ongole Urban, Prakasam | Oct 24, 2025
ది ప్రకాశం జిల్లా ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ రాజాబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డితో కలిసి వారు శుక్రవారం ప్రకాశం భవనానికి వచ్చారు. ఎంపీ ఈ సందర్భంగా మాజీ సైనికులను కలెక్టరుకు పరిచయం చేశారు. వారి యోగక్షేమాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఒంగోలు నగరంలో రంగరాయుడు చెరువుకు ఈశాన్యం వైపున జాతీయ జెండా పక్కన అమర జవానుల స్మారక స్థూపం నిర్మించేందుకు 100 × 80 అడుగుల విస్తీర్ణంలో స్థలం కేటాయించాలని కలెక్టరుకు వారు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.