ఆందోల్: సుల్తాన్పూర్ జేఎన్టీయూ లో ఉరివేసుకుని విద్యార్థి ఆత్మహత్యాయత్నం
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓ విద్యార్థి తన హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. విద్యార్థులు కాపాడే ప్రయత్నం చేసి CPR చేసి అంబులెన్స్ లో తరలిస్తుండగా మృతి చెందాడు. విద్యార్థి స్వస్థలం సూర్యాపేట కు చెందిన మహేందర్ గా గుర్తించారు. సిఐ అనిల్ కుమార్ ఘటన స్థలానికి చేరుకొని ఆత్మహత్యకు గల కారణాలు ఆరా తీస్తున్నారు.