భూపాలపల్లి: చనిపోయిన కొడుకు నేత్రాలను దానం చేసి, మానవత్వం చాటుకున్న తల్లిదండ్రులు
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ కాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు గోవర్ధన్ కుమారుడు శ్రావణ్ గుండెపోటుతో సోమవారం ఉదయం మృతి చెందాడు. పుట్టెడు శోకంలో ఉన్న తన కొడుకు కళ్ళు బతకాలనుకున్నారు తల్లిదండ్రులు,దీంతో తన కొడుకు నేత్రాలను హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి దానం చేసి మానవత్వం చాటుకోడమే కాదు వేల మందికి ఆదర్శంగా నిలిచారు గోవర్ధన్ దంపతులు. ఉదయం కుమారుడు చనిపోవడంతో కొడుకు చనిపోయినా కళ్ళు బతకాలన్న ఉద్దేశంతో ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి నేత్రాలు దానం చేసినట్లు గోవర్ధన్ కుటుంబ సభ్యులు సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు తెలిపారు.