అన్నవరంలో ఉత్సవాలు పండితులను సత్కరించిన ఈవో సుబ్బారావు
అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య సన్నిధిలో సోమవారం శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంబమయ్యాయి శ్రీ వనదుర్గాదేవితో పాటు దుర్గాదేవి అమ్మవారు తొలిరోజు విశేష భరితమైన అలంకరణలో దర్శనమిచ్చారు. మరోపక్క రత్నగిరి కొండలపై ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈవో సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగాయి. పండితులకు సత్కార కార్యక్రమం సైతం ఘనంగా జరిగినట్లు ఈవో తెలిపారు