తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారించారు. ఈ క్రమంలో మంగళవారం తాడిపత్రిలో హెల్మెట్ల ప్రాముఖ్యతపై పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బందితో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నుంచి పట్టణంలోని ప్రధాన వీధులు, రహదారుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలను పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఏఎస్పీ సూచించారు.