గుండ్లపల్లి: డిండి మండలంలో కారు అదుపుతప్పి రెండు కార్లను ఢీ కొట్టిన ఘటనలో పలువురికి గాయాలు
నల్లగొండ జిల్లా డిండి మండలంలోని శుక్రవారం శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళుతున్న కారు అదుపుతప్పి రహదారిపై వెళ్తున్న రెండు కార్లను ఢీ కొట్టింది. ఈ సంఘటన డిండి ఆయకట్ట నేషనల్ 765 హైవే రోడ్డుపై జరిగింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు ..మూడు కార్లలో 12 మంది ప్రయాణించగా పలువురికి గాయాలు అయ్యాయని పెట్రోలింగ్ పోలీసులు తెలిపారు .గాయాలైన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.