భూపాలపల్లి: తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే
ఘనంగా స్వాగతం పలికిన పెద్దకుంటపల్లి గ్రామస్థులు
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11 వార్డు పెద్దకుంటపల్లి తండా గ్రామంలో బంజార, లంబాడీ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన తీజ్ పండుగ ను ఘనంగా నిర్వహిస్తున్న తీజ్ ఉత్సవాలలో గ్రామస్థుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిధిగా పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఈ సందర్బంగా లంబాడీ సోదరీమణులతో కలిసి ఉత్సాహంగా డాన్స్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.