సీఎం పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ముందస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలంలోని పెద్దన్నవారిపల్లెలో సీఎం చంద్రబాబు నాయుడు శనివారం పర్యటించిన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత, ముందస్తు ఏర్పాట్లను సమన్వయంగా ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను శుక్రవారం ఆదేశించారు. ఈ సందర్భంగా హెలిపాడ్ ప్రాంతాన్ని, ప్రజావేదిక సభాస్థలి ప్రాంతాన్ని కలెక్టర్, ఎస్పీలు విస్తృతంగా పర్యటించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసుకోవాలని తెలిపారు. భద్రతా లోపం ఉండరాదని తెలియజేశారు.