ఆలూరు: అస్పరిలో లారీ ఢీకొని విద్యార్థి మృతి
Alur, Kurnool | Oct 9, 2025 అస్పరి మండలం బిల్లేకల్లు సమీపంలో గురువారం మధ్యాహ్నం లారీ స్కూటర్ను ఢీకొనడంతో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో స్కూటర్పై వెళ్తున్న విద్యార్థి శ్రీనివాస్ (9వ తరగతి, ఆలూరు గురుకుల పాఠశాల) అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన తండ్రి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గాయపడిన వ్యక్తిని ఆదోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.