మేడ్చల్: పోచారంలో బిల్డింగ్ పై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య.. కాలేజీ ముందు బంధువుల ఆందోళన
పోచారం మున్సిపాలిటీ యన్నంపేట్ రాక్ వుడ్ ఇంటర్నేషనల్ లో ఎంపీసీ సెకండియర్ చదువుతున్న అభి చేతన్ రెడ్డి గురువారం నాలుగో అంతస్తు నుంచి దూకాడు. అతడిని మేడిపల్లిలోని శ్రీకర హాస్పటల్కి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. కాలేజీ యజమాన్యం వల్లే చనిపోయాడని మృతుని బంధువులు శుక్రవారం స్కూల్ వద్ద ఆందోళన చేపట్టారు. యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.