ఎచ్చెర్ల: కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి జిల్లాకి వస్తున్న సందర్భంగా ఘనస్వాగతం పలికిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రులుగా కింజరాపు అచ్చం నాయుడు ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా శ్రీకాకుళం జిల్లాకి వస్తున్న సందర్భంగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి నాయకులు సోమవారం సాయంత్రం ఐదున్నర గంటలకు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం రణస్థలం జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న కింజరాపు ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.