పేద మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఒక వరం: ఎమ్మెల్యే నల్లారి కిషోర్
పేద మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఒక వరమని పీలేరు ఎమ్యెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ,ప్రమాదాల్లో గాయపడి అప్పులు చేసి చికిత్స పొంది సీఎం సహాయ నిధి కొరకు దరఖాస్తు చేసుకుని ఎమ్మెల్యే ను ఆశ్రయించగా ఆయన సూచన మేరకు సీఎం సహాయనిధి నుంచి 56 మందికి వచ్చిన 49,23,195 రూపాయలు చెక్కులను కలికిరి మండలం పత్తేగడ పంచాయతీ నగిరిపల్లిలో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వారికి అందజేశారు.అదేవిధంగా వేర్వేరు ప్రమాదాలలో మృతి చెందిన టీడీపీ కార్యకర్తలు ఇద్దరికి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు చొప్పున వచ్చిన బీమా చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు