కారంపూడి మండల పరిధిలో సీజనల్ వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలి : ప్రభుత్వ వైద్యులు లక్ష్మీ మౌనిక
సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, జ్వరాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కారంపూడి ప్రభుత్వ వైద్యులు లక్ష్మీ మౌనిక మీడియా కు తెలియజేశారు. రెండు నుండి మూడు రోజులు జ్వరం వచ్చినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. వేడిగా ఉండే ఆహారం తీసుకోవడం కాచి వడపోసిన మంచినీటిని తీసుకోవాలన్నారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేయడం జరిగింది.